Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘చినబాబు’గా కార్తీ... ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సూర్య!

  • ‘ట్విట్టర్’ లో ఫస్ట్ లుక్ విడుదల
  • కలర్ ఫుల్ డ్రెస్ లో కాలరెగరేస్తున్న కార్తీ
  • ‘మా రైతు మీకు నచ్చుతాడని ఆశిస్తున్నా’ అన్న సూర్య
పాండిరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘చినబాబు’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ప్రముఖ హీరో, కార్తీ అన్నయ్య సూర్య విడుదల చేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫస్ట్ లుక్ పోస్ట్ చేశారు. తలకు తువాలు చుట్టి, కళ్లజోడు పెట్టి, చేతికి వాచీ పెట్టి కలర్ ఫుల్ డ్రెస్ లో ఉన్న కార్తీ తన కాలర్ ఎగరేస్తూ రాయల్ ఎన్ ఫీల్డ్ పై నవ్వుతూ కూర్చుని ఉన్నాడు. కార్తీ కూర్చున్న రాయల్ ఫీల్డ్ నెంబర్ ప్లేట్ పై ఇంగ్లీషులో ఫార్మర్ అని రాసి ఉంది.

‘కార్తీ నెక్స్ట్ సినిమా చిన్నబ్బాయి ఫస్ట్ లుక్ ఇదీ. మా రైతు మీకు నచ్చుతాడని ఆశిస్తున్నా’ అంటూ సూర్య తన పోస్ట్ లో పేర్కొన్నాడు. కాగా, ఈ చిత్రం తమిళంలో ‘కదాయ్ కుట్టి సింగమ్’గా రూపొందుతోంది.
surya
karthi

More Telugu News